మోదీజీ యుద్దం ఆపేలా చేయండి
విన్నవించిన పెద్దన్న అమెరికా
అమెరికా – ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాట్ టాపిక్ గా మారారు. ఆయన ఇప్పటికే మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా పేరు పొందారు. టాప్ లో కొనసాగుతున్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్ పై ఇంకా యుద్దం కొనసాగుతోనే ఉంది. మరో వైపు సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఓ వైపు అమెరికా ఇంకో వైపు రష్యా మంకుపట్టు పట్టాయి.
ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని ఆంక్షలు విధించినా ఎక్కడా తగ్గడం లేదు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమీర్ పుతిన్. ఇదిలా ఉండగా భారత్ , రష్యా దేశాల మధ్య విడదీయలేని బంధం ఉంది. ప్రధానంగా ప్రధాని మోడీ, రష్యా చీఫ్ పుతిన్ ఇద్దరూ మంచి స్నేహితులు.
ఈ మధ్యనే మోడీ రష్యాలో పర్యటించారు. ఈ సందర్బంగా వీరిద్దరి మధ్య మరింత స్నేహం బలపడింది. ఊహించని రీతిలో రష్యా దేశం అందజేసే అత్యున్నత పౌర పురస్కారంతో నరేంద్ర మోడీని సత్కరించారు పుతిన్. ఆయనకు బంగారు పతకాన్ని అందజేశారు.
ఈ తరుణంలో అమెరికా ఇప్పుడు సంకట స్థితిని ఎదుర్కొంటోంది. రష్యా అధ్యక్షుడిని ఒప్పించాలంటే తమ వల్ల కావడం లేదని మోడీ రంగంలోకి దిగాలని, ఆయనతో సంప్రదింపులు జరిపి ఉక్రెయిన్ పై యుద్దం ముగించేలా చూడాలని కోరింది యుఎస్.
ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం తరపున మాథ్యూ మిల్లర్ ప్రకటించారు. మొత్తంగా మోడీ ప్రాధాన్యత అంతర్జాతీయ స్థాయిలో మరింత పెరిగినట్టయింది.