ఈవీ టెక్నాలజీకి మంచి భవిష్యత్తు
కేంద్ర మంత్రి హెచ్ డి కుమార స్వామి
న్యూఢిల్లీ – ఈవీ టెక్నాలజీకి మంచి భవిష్యత్తు ఉందన్నారు కేంద్ర గనుల శాఖ మంత్రి హెచ్ డి కుమార స్వామి. మంగళవారం సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) న్యూఢిల్లీలో ‘చార్జింగ్ ఎహెడ్ – ఎంపవరింగ్ ఆన్ EV-రెడీ వర్క్‌ఫోర్స్’ వర్క్‌షాప్‌ను నిర్వహించింది.
మన ఆర్థిక వ్యవస్థలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు కేంద్ర మంత్రి. 2027 విజన్ వైపు మనం వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు హెచ్ డి కుమార స్వామి. ఇందులో భాగంగా విద్యుత్ వాహనాల వాడకం రాబోయే రోజుల్లో మరింత పెరగనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
భారత ప్రభుత్వం, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇ-మొబిలిటీ రంగంలో ఎఫ్ఏఎంఐ 1, 2 , ఈఎంపీఎస్ వంటి విధానాల ద్వారా గణనీయమైన సంస్కరణలకు తీసుకు రావడం జరిగిందని చెప్పారు కేంద్ర మంత్రి.
ఈ ప్రయత్నాలు దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వేగవంతమైన వృద్ధికి తోడ్పడే ఒక బలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించ డం జరిగిందన్నారు. ఈవీ టెక్నాలజీలలో వేగ వంతమైన పురోగతిని చూస్తున్నామని , అపారమైన వనరులు, అవకాశాలు రానున్నాయని తెలిపారు కుమార స్వామి.