రీజిన‌ల్ రింగ్ రోడ్డుపై సీఎం ఫోక‌స్

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన ఎంపీ కిర‌ణ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్ – భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రీజినల్ రింగ్ రోడ్ ను తెలంగాణ ప్రభుతం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పారు.

ఓఆర్ఆర్ , ట్రిపుల్ ఆర్ కి మధ్య 25 నుంచి 30 కి.మీ. దూరం ఉన్నందున ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారని స్ప‌ష్టం చేశారు. దీని వ‌ల్ల యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయ‌ని చెప్పారు ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా ట్రిపుల్ ఆర్ లో ఉత్తర భాగం ఇప్పటికే పూర్తయిందన్నారు. దక్షిణ భాగాన్ని కేంద్రం పెండింగ్ లో పెట్టిందని ఆరోపించారు. వెంట‌నే మోడీ ప్ర‌భుత్వం దృష్టి సారించి, నిధులు మంజూరు చేసి, ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీ కోరారు.