ప్రయాణీకుల ఫిర్యాదులపై సీరియస్
ఫరూక్ నగర్ డిపో కండక్టర్ పై చర్యలు
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తమ సంస్థ ప్రయాణీకుల సంక్షేమానికి, భద్రతకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. బుధవారం ఎండీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇదిలా ఉండగా ఫరూఖ్‌నగర్ డిపోనకు చెందిన ఒక కండక్టర్ ప్రయాణ సమయంలో తనతో ప్రవర్తించిన తీరు సరిగా లేదని ఒక యువతి సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు వీసీ సజ్జనార్. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణకు ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు.
విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై శాఖా పరమైన చర్యలను సంస్థ తీసుకుంటుందని వెల్లడించారు వీసీ సజ్జనార్. టీజీఎస్ఆర్టీసీ మహిళా భద్రత విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదన్నారు. ప్రతి రోజూ సగటున 35 లక్షల మందికి పైగా మహిళలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని ఆర్టీసీ కల్పిస్తోందని స్పష్టం చేశారు.