రేపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇచ్చిన మాట ప్రకారం రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నారు. ఇందులో భాగంగా విధి విధానాలు, మార్గ దర్శకాలను జారీ చేసింది .
ఇదిలా ఉండగా తీసుకున్న రుణాలకు సంబంధించి తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండి తీరాల్సిందేనని జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. చివరకు సీఎం రేవంత్ రెడ్డి స్పందించాల్సి వచ్చింది. అలాంటిది ఏమీ లేదని , రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు మాఫీ చేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
జూలై 18న గురువారం తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల రుణ మాఫీకి సంబంధించి రూ. 1 లక్ష జమ చేయనుంది రైతుల ఖాతాల్లో నేరుగా. రేపటి సాయంత్రం లోగా వీటిని వేస్తామని స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.
జమ చేసిన అనంతరం రైతు వేదికపై లబ్దిదారులతో సంబరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు.