NEWSANDHRA PRADESH

బాబూ ఢిల్లీ చుట్టూ చ‌క్క‌ర్లు కొడితే ఎలా..?

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేశారు. బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్ర‌భుత్వంలో చ‌క్రం తిప్పాల్సిన సీఎం బాధ్య‌త‌లు స్వీక‌రించాక ప‌దే ప‌దే ఢిల్లీకి చ‌క్క‌ర్లు కొట్ట‌డం త‌ప్పా చేసింది ఏముంది అంటూ ప్ర‌శ్నించారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

రాష్ట్రంలో పాల‌నా ప‌రంగా చూసు కోవాల్సిన ముఖ్య‌మంత్రి ప‌దే ప‌దే ఎక్కుడు దిగుడు త‌ప్పా ఒక్క ప‌ని పూర్తి కాలేద‌న్నారు. ఎవ‌రు ఏం చేస్తున్నారో తెలియ‌డం లేద‌న్నారు ఏపీ పీసీసీ చీఫ్‌. అస‌లు ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారంటూ ప్ర‌శ్నించారు.

ముక్కు పిండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను వ‌సూలు చేసుకోవాల్సింది పోయి ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌కు జీ హుజూర్ అంటూ స‌లాంలు కొడుతూ విలువైన కాలాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నారంటూ నిల‌దీశారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా..మోడీతో గానీ ,ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీద ఎందుకు ప్రకటన చేయించలేక పోయారంటూ మండిప‌డ్డారు. గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా ?