NEWSNATIONAL

రైత‌న్న వినూత్న నిర‌స‌న

Share it with your family & friends

అధికారుల నిర్ల‌క్ష్యంపై ఆగ్ర‌హం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ – ఈ దేశంలో రైతుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంది. పండించిన పంట కోసం ఇబ్బంది. పెట్టుబ‌డులు లేక నానా క‌ష్టం. అయినా వారి ప‌ట్ల నేత‌లు, అధికారులు వివ‌క్ష చూపుతుండ‌డం బాధాక‌రం. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన ఓ రైతు త‌న భూమిని కొంద‌రు భూ బ‌కాసురులు క‌బ్జా చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ వాపోయాడు. ప‌లుమార్లు జిల్లా క‌లెక్ట‌రేట్ లో అధికారుల‌కు ఫిర్యాదు చేశాడు. భూమి త‌న స్వంత‌మ‌ని, అది లేక పోతే తాను బ‌త‌క లేనంటూ వాపోయాడు.

అయినా క‌లెక్ట‌ర్ ద‌గ్గ‌రి నుంచి ఎవ‌రూ స్పందించ లేదు. దీంతో గ‌త్యంత‌రం లేక త‌ను క‌లెక్ట‌రేట్ కు వెళ్లాడు. అక్క‌డ చేత‌కాక కూలి పోయాడు. లేవ‌లేక ప‌డుకుంటూ నిర‌స‌న తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో దేశ వ్యాప్తంగా వైర‌ల్ గా మారింది. రైతు శంక‌ర్ లాల్ పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం మ‌రింత బాధ క‌లిగించిందంటూ కుటుంబీలు వాపోయారు.

స‌ద‌రు రైతు స్వ‌స్థ‌లం మ‌ధ్య ప్ర‌దేశ్ లోని మంద‌సౌర్ . స్థానిక భూ మాఫియా త‌న భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు బాధితుడు. ఒక్క‌సారిగా రైతు శంక‌ర్ లాల్ చ‌ర్చ‌నీయాంశంగా మారాడు.