ప్రజలకు అడ్డు గోడలు ఎందుకు..?
అసెంబ్లీ గోడను తెరిపించిన స్పీకర్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సభాపతి అయ్యన్న పాత్రుడు దూకుడు పెంచారు. ప్రజా ప్రతినిధులు ఎవరైనా సరే ఆదర్శంగా ఉండాలని ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు నేర్చుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు.
ఇదే సమయంలో ప్రజలు తమ బాధలు చెప్పుకునేందుకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసేందుకు అడ్డు గోడలు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదని , ప్రజాస్వామ్యం అనిపించు కోదని పేర్కొన్నారు అయ్యన్న పాత్రుడు.
ఇదిలా ఉండగా అమరావతి రైతుల కష్టాలు వినపడ కూడదని ఒక నియంత కట్టుకున్న అడ్డుగోడను తొలగించాలని ఆదేశించారు స్పీకర్. గేట్-2 నుంచి ఎవ్వరూ రాకుండా జగన్ కట్టిన గోడని తొలగించి, గేటుని తెరిపించారు.
అమరావతి రైతులు తమకు జరిగిన అన్యాయానికి ప్రజాసౌమ్య పద్ధతిలో నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సమయంలో జగన్ రెడ్డి గేటు-2 ని మూసి, గోడ కట్టించారు. ఇవాళ సభాపతి అయ్యన్నపాత్రుడు తిరిగి తెరిపించారు.
ప్రజల తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. ప్రజాసౌమ్య వ్యవస్థలో ప్రజాసౌమ్య నిలయమైన శాసనసభ గేట్లు తెరిచే ఉండాలి. రాష్ట్రంలో ఇప్పుడున్నది ప్రజాసౌమ్య ప్రభుత్వం, ప్రజలకి అందుబాటులో ఉండే ప్రభుత్వం, ఇది ప్రజా అసెంబ్లీ అని స్పష్టం చేశారు అయ్యన్న పాత్రుడు.