SPORTS

ముద్దుగుమ్మ చ‌ల్లంగ బ‌తుక‌మ్మ

Share it with your family & friends

క్రికెట‌ర్ స్మృతి మంధాన పుట్టిన రోజు

ముంబై – భార‌త మ‌హిళా క్రికెట్ రంగంలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న ఏకైక క్రికెట‌ర్ స్మృతీ మంధాన‌. ఇవాళ ఆమె పుట్టిన రోజు. 18న జూలై 1996లో ముంబైలో పుట్టారు. మ‌హిళా క్రికెట్ జ‌ట్టులో మోస్ట్ పాపుల‌ర్ క్రికెట‌ర్.

ప్రపంచకప్ చరిత్రలో తొలి 10 ఓవర్లలో సిక్సర్ బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా స్మృతి మంధాన నిలిచింది. ఆమె ఎడమ చేతి బ్యాట్స్‌మెన్ కావ‌డం విశేషం. ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించ‌డంలో, ఫోర్లు, సిక్స‌ర్లు అవ‌లీల‌గా బాద‌డంలో పేరు పొందారు స్మృతీ మంధాన‌. కుడి చేతి వాటం బౌల‌ర్.

ఆమె తొలిసారిగా 2014లో తొలి టెస్టు మ్యాచ్ ఆడారు. ప‌లు అంత‌ర్జాతీయ టి20 మ్యాచ్ ల‌లో, టోర్నీల‌లో దుమ్ము రేపారు. అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నారు. అక్టోబ‌ర్ 1, 2021లో స్మృతీ మంధాన ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై టెస్టు సెంచ‌రీ చేశారు. ఈ ఘ‌న‌త సాధించిన తొలి భార‌తీయ మ‌హిళా క్రికెట్ ప్లేయ‌ర్ గా గుర్తింపు పొందారు.

171 బంతుల్లో తొలి టెస్టు సెంచరీ పూర్తి చేయ‌డం విశేషం. స్మృతి మంధాన 216 బంతుల్లో 127 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టారు. పేరెంట్స్ స్మిత‌, శ్రీ‌నివాస మంధాన‌. త‌న సోద‌రుడు కూడా క్రికెట‌ర్. త‌న‌ను చూసి స్పూర్తి పొందింది మంధాన‌.

9 సంవత్సరాల వయస్సులో, మంధాన మహారాష్ట్ర అండర్ -15 జట్టుకు, 11 సంవత్సరాల వయస్సులో మహారాష్ట్ర అండర్ -19 జట్టుకు ఎంపికైంది. అక్టోబర్, 2013లో వ‌న్డే మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసిన మొదటి భారతీయ మహిళగా స్మృతి మంధాన రికార్డ్ సృష్టించింది.

వడోదరలోని అలంబిక్ క్రికెట్ గ్రౌండ్‌లో వెస్ట్ జోన్ అండర్-19 టోర్నమెంట్‌లో 150 బంతుల్లో అజేయంగా 224 పరుగులు చేసింది. 2016 మహిళల ఛాలెంజర్ ట్రోఫీలో, మంధాన ఇండియా టీమ్ ను అనేక మ్యాచ్‌లలో మూడు అర్ధ సెంచరీలతో ఆక‌ట్టుకుంది. టీమ్ బ్లూతో జరిగిన ఫైనల్‌లో 82 బంతుల్లో అజేయంగా 62 పరుగులు చేసింది. ఆమె 192 పరుగులతో టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

స్మృతి దేశీయ క్రికెట్ కెరీర్ కంటే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మరింత ఆసక్తికరంగా ఉంది. టెస్టు క్రికెట్ కెరీర్ 2014లో ఇంగ్లండ్ తో ప్రారంభ‌మైంది. రెండు ఇన్నింగ్స్ ల‌లో 73 ర‌న్స్ చేసింది. జ‌ట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించింది. 2013లో బంగ్లాదేశ్‌తో వన్డే, టీ20 ఆడడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించారు. 2016లో ఆస్ట్రేలియాపై తొలి అంతర్జాతీయ సెంచరీ సాధించింది. అదే 109 బంతుల్లో 102 పరుగులు వచ్చాయి. ఐసీసీ మ‌హిళ‌ల జ‌ట్టు పేర్ల‌లో చేర్చిన ఏకైక ఇండియ‌న్ క్రికెట‌ర్ స్మృతీ ఇరానీ.
2019లో న్యూజిలాండ్‌పై జరిగిన టి20 మ్యాచ్ లో కేవ‌లం 24 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించింది స్మృతి మందాన‌.

స్మృతి మంధానకు ఎన్నో అవార్డులు ద‌క్కాయి. 2016లో ‘ఐసీసీ ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది.. 2018లో బీసీసీఐ ఆమెకు ‘బెస్ట్ ఉమెన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు’ ఇచ్చింది. 2019లో భార‌త ప్ర‌భుత్వం అర్జున అవార్డుతో స‌త్క‌రించింది.