‘మా’పై దుష్ప్రచారం ఆపండి
డీజీపీకి మా చీఫ్ ఫిర్యాదు
హైదరాబాద్ – తెలుగు మూవీ అసోసియేషన్ (మా) కీలక వ్యాఖ్యలు చేసింది. తమపై దుష్ప్రచారం కావాలని చేస్తున్నారని, వెంటనే వీటిని నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. మా అసోసియేషన్ గురువారం డీజీపిని కలిసింది.
సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున నటీ నటులపై ట్రోల్స్ కొనసాగుతూ వస్తున్నాయని, ప్రత్యేకించి వ్యక్తిగతంగా దూషణలు, లేని పోని కామెంట్స్ చేస్తున్నారంటూ , శాడిస్టుల్లాగా మారారంటూ ఆరోపించింది. ప్రధానంగా నటీ నటుల గురించి ట్రోల్స్ పై ఫోకస్ పెట్టాలని కోరింది.
మా అసోసియేషన్ ను టార్గెట్ చేశారని, నటీ నటులపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వారిని గుర్తించాలని , తమను వాటి నుంచి దూరం చేసేలా ఆదుకోవాలని కోరింది. ప్రధానంగా ఐదు యూట్యూబ్ ఛానళ్లు తమను లక్ష్యంగా చేసుకుని దారుణంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారంటూ వాపోయింది మా అసోసియేషన్. సదరు ఐదు యూ ట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపికి అందజేశారు మా ప్రతినిధులు.