NEWSTELANGANA

పాల‌మూరులో ప్రాజెక్టులు పూర్తి కావాలి

Share it with your family & friends

ప‌నుల ప్ర‌గ‌తిపై రేవంత్ రెడ్డి ఆరా

హైద‌రాబాద్ – తాను పుట్టిన గ‌డ్డ‌కు మ‌రింత న్యాయం చేసే ప‌నిలో ప‌డ్డారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. త‌న‌ను రాజ‌కీయంగా ఆదుకున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని రాష్ట్రానికి ఆద‌ర్శ నియోజ‌క‌వ‌ర్గంగా తీర్చి దిద్దుతాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. భారీ ఎత్తున తాను సీఎంగా కొలువు తీరిన వెంట‌నే నిధుల‌ను మంజూరు చేశారు.

ఇదే స‌మ‌యంలో ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా గ‌త 10 ఏళ్ల కాలంలో తీవ్ర వివ‌క్ష‌కు లోనైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప‌లుమార్లు ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించారు. ప్ర‌ధానంగా కోడంగ‌ల్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం త్వ‌రిత‌గ‌తిన పూర్తి కావాల‌ని ఆదేశించారు. ఎక్క‌డా నిర్ల‌క్ష్యం చేయ‌కుండా యుద్ద ప్రాతిప‌దిక‌న ప‌నులు చేయాల‌ని అన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.

నీటి పారుద‌ల శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలోని ప్రాజెక్టుల‌పై దృష్టి సారించాల‌ని హెచ్చ‌రించారు. అంతే కాకుండా కోడంగ‌ల్ కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని ఆదేశించారు. వెంట‌నే త‌మ‌కు ప్ర‌తిపాద‌న‌లు అందిస్తే నిధులు మంజూరు చేస్తామ‌న్నారు. అంతే కాకుండా మ‌ద్దూరు రెసిడెన్షియ‌ల్ క్యాంప‌స్ నిర్మాణంపై సూచ‌న‌లు చేశారు సీఎం.