NEWSANDHRA PRADESH

ఏపీలోని యూనివ‌ర్శీటీల‌కు ఇన్‌ఛార్జ్ వీసీలు

Share it with your family & friends

నియ‌మించిన కూట‌మి ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి – సీఎం నారా చంద్ర‌బాబు సార‌థ్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ప‌లువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ ల‌ను బ‌దిలీ చేసిన స‌ర్కార్ ఉన్న‌ట్టుండి రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాల‌యాల‌కు ఇన్ ఛార్జ్ వైస్ ఛాన్స‌ల‌ర్ ల‌ను నియ‌మించింది.

ఎస్‌వీయూ ఇన్‌ఛార్జ్ వీసీగా చిప్పాడ అప్పారావుకు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఎస్‌కేయూ ఇన్‌ఛార్జ్ వీసీగా బీ. అనిత, ఏయూ ఇన్‌ఛార్జ్ వీసీగా గొట్టపు శశిభూషణ్‌రావు, నాగార్జున వర్సిటీ వీసీగా కంచర్ల గంగాధర్‌,
జేఎన్‌టీయూ అనంతపురం ఇన్‌ఛార్జ్ వీసీగా సుదర్శన్ రావును నియ‌మించింది ప్ర‌భుత్వం.

ఇక పద్మావతి మహిళా వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా వీ. ఉమ, జేఎన్‌టీయూ విజయనగరం ఇన్‌ఛార్జ్ వీసీగా రాజ్యలక్ష్మీ, జేఎన్‌టీయూ కాకినాడ ఇన్‌ఛార్జ్ వీసీగా మురళీకృష్ణ, నన్నయ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా వై.శ్రీనివాసరావు, విక్రమ సింహపురి వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా సారంగం విజయ భాస్కర్ రావుకు బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

కృష్ణా వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ఆర్‌.శ్రీనివాస్‌రావు, రాయలసీమ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ఎన్‌టీకే నాయక్‌, ద్రవిడ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా ఎం.దొరస్వామి, ఆర్కిటెక్చర్‌, ఫైన్‌ఆర్ట్స్‌ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా విశ్వనాథకుమార్‌, ఆంధ్ర కేసరి వర్సిటీ (ఒంగోలు) ఇన్‌ఛార్జ్ వీసీగా డీవీఆర్ మూర్తిల‌ను నియ‌మించింది.

వీరితో పాటు అబ్దుల్ హక్‌ ఉర్దూ వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా పఠాన్‌ షేక్‌ ఖాన్‌, యోగి వేమన వర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీగా కె.కృష్ణారెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.