చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం నేరం కాదు
బెంగళూరు హైకోర్టు సంచలన తీర్పు
కర్ణాటక – రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. టెక్నాలజీ పెరిగి పోవడంతో బూతు ప్రతి చోటా రాజ్యమేలుతోంది. ఈ తరుణంలో పోర్న్ చూడటం ఎంత మాత్రం నేరం కాదని గతంలో కూడా పలు కోర్టులు తీర్పులు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా ఓ వ్యక్తి చైల్డ్ పోర్నోగ్రఫీ చూశాడంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన కేసుపై విచారణ చేపట్టింది హైకోర్టు. చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం ఎంత మాత్రం నేరం కాదని స్పష్టం చేసింది ధర్మాసనం. అయితే అలాంటి కంటెంట్ లేదా వీడియోలు, ఫోటోలను ప్రసారం చేయడం మాత్రం తప్పేనంటూ స్పష్టం చేసింది.
అయితే ఆన్ లైన్ లో చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం ఐటీ చట్టంలోని సెక్షన్ 67బీ ప్రకారం నేరం కానే కాదని కుండ బద్దలు కొట్టారు న్యాయమూర్తి. మెటీరియల్ ను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం మాత్రమే నేరం కిందకు వస్తుందని తీర్పు చెప్పారు.
ఇదిలా ఉండగా మార్చి 2022లో నిందితుడు చైల్డ్ పోర్నోగ్రఫీ వెబ్ సైట్ ను చూసినట్లు సైబర్, ఎకనామిక్, నార్కోటిక్స్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టి పారేశారు. కోర్టులో నిందితుడు తాను చూశానే తప్పా ఎవరికీ పంపించ లేదని తెలిపాడు.