విడి పోయిన హార్దిక్ పాండ్యా..నటాషా
కొడుకు సంరక్షణ బాధ్యత ఇద్దరిదే
ముంబై – అంతా అనుకున్నట్టుగానే గత కొంత కాలం నుంచి వస్తున్న పుకార్లకు పుల్ స్టాప్ పెట్టారు భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా. తాజాగా జరిగిన వరల్డ్ కప్ టి20 లో అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు పాండ్యా. కానీ ఉన్నట్టుండి వ్యక్తిగత జీవితంలో కొంత ఇబ్బంది ఎదుర్కొన్నట్లు టాక్. ఇది పక్కన పెడితే గతంలో ఏరికోరి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నటాషా స్టాంకోవిక్ ను. వీరిద్దరికీ ఒక కొడుకు ఉన్నాడు.
ఇదిలా ఉండగా గురువారం స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో తాను , నటాషా విడి పోయినట్లు ప్రకటించాడు. ఈ మేరకు పోస్ట్ చేశాడు. ఈ ప్రకటనతో వీరిద్దరూ అధికారికంగా విడి పోయారు. హార్దిక్ పాండ్యా గత కొన్ని సంవత్సరాలుగా టీమిండియాలో కీలకమైన ఆటగాడిగా కొనసాగుతూ వస్తున్నాడు. తను జట్టుకు స్కిప్పర్ గా పని చేశాడు.
మరో వైపు నటాషా స్టాంకోవిచ్ స్వస్థలం సెర్బియా. ఆమె సినిమాలలో నటించింది. ఈ ఇద్దరికీ 2020లో నిశ్చితార్థం జరిగింది. ఇద్దరికీ నాలుగు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. ఆ బాలుడిని పెంచుకునే బాధ్యత తామిద్దరిదీ అని ప్రకటించాడు హార్దిక్ పాండ్యా.