SPORTS

బీసీసీఐ నిర్వాకం శ‌శి థ‌రూర్ ఆగ్ర‌హం

Share it with your family & friends

వ‌న్డే సీరీస్ కు శాంస‌న్ లేక పోవ‌డం

న్యూఢిల్లీ – కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ బీసీసీఐపై నిప్పులు చెరిగారు. శుక్ర‌వారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. తాజాగా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ శ్రీ‌లంక టూర్ లో భాగంగా రెండు ఫార్మాట్ ల‌కు వేర్వేరుగా జ‌ట్ల‌ను ప్ర‌క‌టించింది. ముంబైకి చెందిన ఇద్ద‌రికీ కెప్టెన్లుగా ఛాన్స్ ఇచ్చింది. వైస్ కెప్టెన్ గా కూడా ముంబైకి చెందిన క్రికెట‌ర్ గిల్ కు అప్ప‌గించింది.

ప్ర‌ధానంగా త‌మ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెట‌ర్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ స్కిప్ప‌ర్ సంజూ శాంస‌న్ ను వ‌న్డే సీరీస్ కు ప‌క్క‌న పెట్ట‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇలా ఇంకెంత కాలం రాజ‌కీయాలు చేస్తారంటూ ప్ర‌శ్నించారు శ‌శి థ‌రూర్.

టి20 సీరీస్ కు సూర్య కుమార్ యాద‌వ్ ను స్కిప్ప‌ర్ గా ఎంపిక చేశారు. ఈ జ‌ట్టులో శాంస‌న్ కు చోటు ద‌క్కినా వ‌న్డే సీరీస్ కు ప‌క్క‌న పెట్టారు. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు కాంగ్రెస్ ఎంపీ. ఆయ‌న కొన్నేళ్ల నుంచి క్రికెట్ పోక‌డ‌ల‌ను ద‌గ్గ‌రుండి చూస్తున్నారు. స్వ‌త‌హాగా క్రికెట్ ఆట ప‌ట్ల మ‌క్కువ క‌లిగి ఉన్నారు. ప‌దే ప‌దే బీసీసీఐ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను నిశితంగా గ‌మ‌నిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు ఏకి పారేస్తూ వ‌స్తున్నారు.

వ‌న్డేల‌లో ట్రాక్ రికార్డ్ బాగా లేక పోయినా కొంద‌రిని ప‌నిగ‌ట్టుకుని సీరీస్ కు ఎంపిక చేయ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు శ‌శి థ‌రూర్. ఆయ‌న చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి.