NEWSNATIONAL

ప్ర‌పంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవ‌ల‌కు బ్రేక్

Share it with your family & friends

స్టాక్ ఎక్స్చేంజ్ లు, విమాన‌యాన సంస్థ‌లు
న్యూఢిల్లీ – ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ సంస్థ‌లో సాంకేతిక లోపం ఏర్ప‌డింది. దీంతో వ‌ర‌ల్డ్ వైడ్ గా సేవ‌ల‌కు తీవ్ర అంతరాయం ఏర్ప‌డింది. మైక్రోసాఫ్ట్ నిర్వ‌హిస్తున్న‌ 365 యాప్స్ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో వీటితో అనుసంధాన‌మై ఉన్న బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం, మీడియా సహా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం ప‌డింది.

ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ్యాపారం జ‌రిగే లండ‌న్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో సేవ‌లు నిలిచి పోయాయి. మ‌రో వైపు అమెరికాలో ఎమర్జెన్సీ సేవల నంబర్ 911 పై ప్రభావం చూపింది. భారత్ దేశంలో విమాన, ఐటీ సేవలకు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది.

విమానాల నుంచి సూపర్ మార్కెట్ లు, బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచి పోయాయి. ఇండియాలో దాదాపు అన్ని ఎయిర్ క్యారియర్‌లు విస్తారా, ఇండిగో, స్పైస్ జెట్ , అకాసా ఎయిర్ బుకింగ్, చెక్-ఇన్ , ఫ్లైట్ అప్‌డేట్‌లను ప్రభావితం చేసే సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. విమానయాన సంస్థలు ఇప్పుడు ప్రయాణికులను మాన్యువల్‌గా తనిఖీ చేస్తున్నాయి.

ఈ సమస్యను పరిష్కరించడానికి త‌మ‌ బృందం చురుకుగా పని చేస్తోందని మైక్రోసాఫ్ట్ వెల్ల‌డించింది. జ‌రిగిన అసౌక‌ర్యానికి చింతిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇత‌ర విమాన‌యాన సంస్థ‌లు సైతం ప్ర‌యాణీకుల‌కు మ‌న్నించ‌మ‌ని కోరాయి.