ఆగస్టు 15న తంగలాన్ విడుదల
డేట్ ఫిక్స్ చేసిన దర్శకుడు పా రంజిత్
తమిళనాడు – ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. తమిళ సినీ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న నిబద్దత, సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు పొందిన పా రంజిత్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ నటించిన తంగలాన్ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించి వచ్చే నెల ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం రోజున వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమా బడ్జెట్ రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. తంగలాన్ మూవీని స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్, జియో స్టూడియోస్ నిర్మించింది తమిళంలో. చరిత్రాత్మక ఫాంటసీ యాక్షన్ చిత్రం. ఈ చిత్రంలో విక్రమ్ తో పాటు మాళవిక మోహన్ , పార్వతి తిరువోతు, డేనియల్ కాల్టాగిరోస్ , హరి కృష్ణన్, వెట్టై ముత్తుకుమార్, అర్జున్ అన్బుదన్ , సంపత్ రామ్ నటించారు.
ఇక విక్రమ్‌కి ఇది 61వ చిత్రం. డిసెంబర్ 2021లో ఈ చిత్రం అధికారికంగా ప్రకటించారు దర్శకుడు పా రంజిత్. అక్టోబర్ 2022లో అధికారికంగా తంగలాన్ పేరుతో టైటిల్‌ను ప్రకటించారు. చెన్నై, ఆంధ్రప్రదేశ్, మధురై, కర్ణాటక లలో చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ అందించగా, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఎ. కిషోర్ కుమార్, సెల్వ RK నిర్వహించారు.