మహంకాళి బోనాలకు సీఎంకు పిలుపు
ఆహ్వానించిన మేయర్ ..ఎంపీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రానికి, రాజధానికి మకుటాయమానంగా నిలిచిన, సంస్కృతికి ప్రతీకగా మారిన సికింద్రాబాద్ లోని మహంకాళి ఆలయంలో బోనాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా ఘనంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఆలయ కమిటీ .
కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రతినిధులతో పాటు హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయ లక్ష్మి, రాజ్య సభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ , దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ , కమిషనర్ హనుమంత రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
గత కొన్నేళ్లుగా మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరగడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏటా జూలై మాసంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవగా కొనసాగుతాయి. భారీ ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు. ఆలయ కమిటీ ఉత్సవాలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని, మహంకాళి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు కమిషనర్ శైలజా రామయ్యర్.