NEWSANDHRA PRADESH

జ‌గ‌న్ రెడ్డీ నీతులు వ‌ల్లిస్తే ఎలా..?

Share it with your family & friends

స‌త్య కుమార్ యాద‌వ్ సీరియ‌స్

అమ‌రావ‌తి – ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ నిప్పులు చెరిగారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏం ముఖం పెట్టుకుని ఢిల్లీలో ధ‌ర్నాకు దిగుతారంటూ ప్ర‌శ్నించారు. మీకు ఆందోళ‌న చేప‌ట్టే నైతిక హ‌క్కు లేద‌ని స్ప‌ష్టం చేశారు.

స్వంత పార్టీ శాస‌న మండ‌లి స‌భ్యుడు ఓ ద‌ళితుడిని హ‌త్య చేయ‌డమే కాకుండా డోర్ డెలివ‌రీ చేసిన సంఘ‌ట‌న మీ హ‌యాంలోనే జ‌రిగింద‌ని , ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని మండిప‌డ్డారు. ఆరోజు ఎందుకు ఢిల్లీలో ధ‌ర్నా చేయ‌లేదంటూ మండిప‌డ్డారు మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్.

పదిహేనేళ్ల విద్యార్థిని నడిరోడ్డులో పెట్రోలు పోసి తగలపెట్టినప్పుడు మీ గొంతు ఎందుకు పెగల లేద‌న్నారు. మీ తాడేపల్లి ప్యాలెస్ కు కూత వేటు దూరంలో ఒక అమాయకురాలిపై అత్యాచారం జరిగినప్పుడు ఎందుకు స్పందించ లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు .

ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ కాలుతుంటే ఫిడేలు వాయించుకుంటూ చలి కాచుకున్న మీకు ఇప్పుడు సుద్ద పూస మాటలెందుకు వ‌స్తున్నాయంటూ ఫైర్ అయ్యారు స‌త్య కుమార్ యాద‌వ్. విచ్చలవిడిగా గంజాయి వ్యాపారాలు చేయించి, యువతను మత్తుకు బానిసలను చేసి, వారి భవిష్యత్తును ఛిద్రం చేసి ఇప్పుడు వేదాలు వల్లిస్తామంటే ఎలా అన్నారు.

ఇప్పటికైనా రాజకీయాలు మాని కలిసి రండి, రాష్ట్రాన్ని మారుద్దాం. వికసిత ఆంధ్ర ప్రదేశ్ ను నిర్మిద్దామ‌ని పిలుపునిచ్చారు.