యూపీఎస్సీ చైర్ పర్సన్ సోనీ రాజీనామా
పరీక్షల నిర్వహణలో తీవ్ర వైఫల్యం
న్యూఢిల్లీ – మోడీ బీజేపీ ప్రభుత్వం అభాసు పాలవుతోంది. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ 2024 పరీక్షలలో భారీ స్కాం బయట పడింది. ఇదే సమయంలో మరకలు అంటని యూపీఎస్సీ నిర్వహణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో ఇంకా పదవీ కాలం ఉన్నా యూపీఎస్సీ చైర్ పర్సన్ మనోజ్ సోనీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది సంచలనం కలిగించింది. ఆయన పదవీ కాలం ఇంకా ఐదేళ్ల పాటు ఉంది.
సివిల్ సర్వీసెస్ పరీక్షలపై కొనసాగుతోంది వివాదం. దీంతో గత్యంతరం లేక తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు మనోజ్ సోనీ. తాను వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
2017లో యూపీఎస్సీలో సభ్యునిగా చేరారు సోనీ. మే 16, 2023న చైర్ పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. యుపిఎస్‌సి అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాన్ని పొందారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే రాజీనామా చేసినట్లు సమాచారం. తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు. అయితే ఇంకా కొత్త వ్యక్తిని ప్రభుత్వం నియమించ లేదు.