NEWSTELANGANA

క‌మ్మొళ్లు త‌ల్లి లాంటోళ్లు – సీఎం

Share it with your family & friends

క‌మ్మ గ్లోబ‌ల్ స‌మ్మిట్ లో కామెంట్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం హైద‌రాబాద్ లో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఆధ్వ‌ర్యంలో గ్లోబ‌ల్ స‌మ్మిట్ ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశానికి సీఎం ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

క‌మ్మ అంటే అమ్మ లాంటిదంటూ కితాబు ఇచ్చారు. కమ్మ వాళ్ల‌కు సాయం చేసే గుణం ఉంటుంద‌న్నారు. దివంగ‌త సీఎం ఎన్టీఆర్ అంటేనే ఓ బ్రాండ్ అన్నారు. రాజ‌కీయాల‌లో ఎంద‌రికో అవ‌కాశం క‌ల్పించిన ఘ‌న‌త ఆయ‌న‌కే ద‌క్కుతుంద‌న్నారు రేవంత్ రెడ్డి.

ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు ఎందుక‌నో రాష్ట్ర‌ప‌తి కాలేక పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాయం చేసే గుణం క‌మ్మ డీఎన్ఏలోనే ఉందన్నారు. కమ్మ ప్రజలు కష్టపడి పనిచేసే స్వభావానికి, తల్లి ప్రేమతో సమానమైన ఆప్యాయతతో కూడిన ప్రవర్తనకు ప్రసిద్ధి చెందారని అన్నారు సీఎం. సారవంతమైన మట్టి ఎక్కడ కనిపిస్తే అక్కడ కమ్మ మనుషులు కనిపిస్తారని ప్ర‌శ‌సించారు.

కష్టపడి పనిచేయడం, ఇతరులకు సహాయం చేయడం కమ్మవారి లక్షణం అన్నారు. కమ్మ సామాజికవర్గం అంటే త‌న‌కు ప్రత్యేక అభిమానం ఉంద‌న్నారు. ఎన్టీఆర్ లైబ్రరీలో చదివిన చదువు నన్ను ఈ స్థాయికి చేర్చిందన్నారు.

దేశం ఇందిరాగాంధీ వేవ్‌లో ఉన్నప్పుడు సంకీర్ణ రాజకీయాలను ఎన్టీఆర్ ప్రవేశ పెట్టార‌ని తెలిపారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చడంలో కమ్మ సామాజిక వ‌ర్గం భాగ‌స్వామ్యం పంచుకోవాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ‌లో ఎవ‌రిపైనా వివ‌క్ష అనేది ఉంద‌న్నారు సీఎం.

జాతీయ స్థాయిలో తెలుగు వారు లేకపోవడం గమనార్హం. కుల, మతాలకు అతీతంగా తెలుగు వారు జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాలని కోరారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన భ‌వ‌నానికి నిధులు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.