నిరుద్యోగుల పోరాటానికి హ్యాట్సాఫ్
ప్రశంసలు కురిపించిన ఆర్ఎస్పీ
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులను ఎంతగా ఇబ్బందులకు గురి చేసినా ఎక్కడా తగ్గలేదని వారి పోరాటానికి తాను హ్యాట్సాఫ్ చెబుతున్నానని పేర్కొన్నారు. శనివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు ఆర్ఎస్పీ.
పరీక్షలను వాయిదా వేయాలని కోరినా మొదట స్పందించ లేదు కాంగ్రెస్ సర్కార్. కానీ నిరుద్యోగుల ఆందోళనలు, పోరాటాలకు, ధర్నాలకు దిగి రాక తప్పలేదు. చివరకు గ్రూప్ -2 , 3 పరీక్షలను వాయిదా వేయక తప్పలేదు.
నిరుద్యోగులు పరీక్షలను రద్దు చేయమని కోరలేదు..కేవలం వాయిదా వేయమని మాత్రమే అడిగారని, వారిని నానా రకాలుగా దాడులకు పాల్పడేలా చేసినా, కేసులు నమోదు చేసినా, అరెస్ట్ లకు పాల్పడినా ఎక్కడా తల వంచ లేదన్నారు. వారి ధైర్యాన్ని అభినందించక తప్పదన్నారు.
నిరుద్యోగులకు అండగా నిలవాల్సిన సోకాల్డ్ మేధావులు ఇప్పటికైనా తమ మనసు మార్చుకుంటే మేలని పేర్కొన్నారు ఆర్ఎస్పీ. సమయం ఉందని, పోస్టుల పెంచాలని కోరుతూనే శాంతియుతంగా పోస్టులు పెంచాలని ప్రయత్నం చేయాలని సూచించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు అభ్యర్థులకు.