పులివ‌ర్తి నాని మంచి న‌టుడు

Share it with your family & friends

ఆయ‌న‌కు నంది అవార్డు ఇవ్వాలి

చిత్తూరు జిల్లా – చంద్ర‌గిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి నిప్పులు చెరిగారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యే పులివ‌ర్తి నానిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌నను మించిన న‌టుడు ఎవ‌రూ లేరంటూ ఎద్దేవా చేశారు.

ఈ సంద‌ర్బంగా నాని ఎలాంటి న‌టుడో ఆధారాల‌తో స‌హా చెప్పారు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి. పులివర్తి నాని 4.12 నిమిషాలకు అందర్నీ ధర్నా చేద్దామని చెప్పాడ‌ని, షర్ట్ కూడా నలగకుండా అంత యాక్టివ్ గా ఉన్న వ్యక్తి 5.20 నిమిషాలకు షర్టు మార్చేసి టీ ష‌ర్ట్ తో వ‌చ్చాడ‌ని అన్నారు.

కాలుకి కట్టొచ్చింది, చేతికి బెల్ట్ వచ్చింది, వీల్ ఛైర్ కూడా వచ్చింది ఇతను నాయకుడు ఎలా అవుతాడని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా పులివ‌ర్తి నాని చేసిన న‌ట‌న ప్ర‌తి ఒక్క‌రినీ ఆలోచింప చేసింద‌న్నారు మాజీ ఎమ్మెల్యే.

పులివ‌ర్తి నాని మంచి న‌టుడు అవుతాడ‌ని, సినిమాల‌లో న‌టించే న‌టీ న‌టుల కంటే ఇత‌ను గొప్ప న‌టుడంటూ సెటైర్ వేశారు. ఒక‌వేళ చంద్ర‌బాబు నాయుడు నంది అవార్డు ఇస్తే నానికి ముందు ఇవ్వాల‌న్నారు.

పబ్లిసిటీ కోసం ఆయ‌న‌ చేసిన యాక్టింగ్ వల్ల ఎస్సై లు సస్పెండ్ అయ్యారు, సీఐ లు సస్పెండ్ అయ్యారు, డీఎస్పీ లు సస్పెండ్ అయ్యారు, ఎస్పీ ట్రాన్స్ఫర్ అయ్యాడు ఏం చేస్తుంది పోలీస్ సంఘం అంటూ ప్ర‌శ్నించారు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి.