ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద నీరు
అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం
అమరావతి – ఏపీలో వాయుగుండం కారణంగా భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. కాలువలు, కుంటలు నిండి పోయాయి. చెరువులు, జలాశయాలు నిండు కుండలను తలపింప చేస్తున్నాయి. మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే రాష్ట్ర వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. మత్స్య కారులు, రైతులు వెళ్ల వద్దని సూచించింది.
కుండ పోతగా కురుస్తున్న వర్షాల ధాటికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సందర్బంగా విజయవాడ లోని ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ 8 గేట్లను ఎత్తవేశారు. దీంతో 1300 క్యూసెక్కుల నీరు కెనాల్స్ కి, దిగువకి 5800 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.
ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని ఎప్పటికప్పుడు బేరిజు వేసుకుంటూ కిందకి నీటి విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలలకు సెలవు ప్రకటించింది విద్యా శాఖ.
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు సీఎం.