NEWSTELANGANA

మూసీ ప్ర‌క్షాళ‌న‌..సుందీక‌ర‌ణ – సీఎం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన ఎనుముల‌ రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం హైద‌రాబాద్ లోని గోప‌న్ ప‌ల్లిలో కొత్త‌గా నిర్మించిన ఫ్లై ఓవ‌ర్ ను ఆయ‌న ప్రారంభించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌సంగించారు రేవంత్ రెడ్డి.

మురికి కూపంగా మారిన మూసీని సుందరీకరణ చేయడంతో పాటు హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని స్ప‌ష్టం చేశారు సీఎం. హైదరాబాద్ నగర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

అంత‌కు ముందు జెండా ఊపి ఉమెన్ బైకర్స్‌ను అనుమతించారు. ఈ ఫ్లైఓవర్ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ అభివృద్ధిలో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.

ఇందు కోసం త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 5౦ వేల కోట్లతో పనులకు శ్రీకారం చుడతామని ప్ర‌క‌టించారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి సంపూర్ణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. మూసీని చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు.