NEWSANDHRA PRADESH

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ర భ‌ద్రం

Share it with your family & friends

హెచ్చ‌రించిన కేంద్ర నిఘా వ‌ర్గాలు

అమ‌రావ‌తి – ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌మాదంలో ఉన్నారా ..అవున‌నే అంటున్నాయి కేంద్ర నిఘా వ‌ర్గాలు. ఈ మేర‌కు కీల‌క ఆదేశాలు జారీ చేసిన‌ట్లు స‌మాచారం. ఆయ‌న భ‌ద్ర‌త విష‌య‌మై హెచ్చ‌రించిన‌ట్లు టాక్. తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్ల‌ను గెలుచుకుంది. వంద శాతం గెలుపును సాధించ‌డంతో ఆ పార్టీ ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌కంగా మారింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం ప‌ద‌విలో ఉండ‌గా మ‌రో ఇద్ద‌రు మ‌నోహ‌ర్, కందుల దుర్గేష్ మంత్రులుగా ఉన్నారు. తాజాగా ఆయ‌న ఉన్న‌త ప‌ద‌విలో ఉండ‌డం, గ‌తంలో ప‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఆయ‌నకు ప్రాణ హాని ఉంద‌ని హెచ్చ‌రించిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఇందులో కేంద్ర నిఘా వ‌ర్గాలు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించాయి. కొన్ని అవాంఛ‌నీయ గ్రూపుల‌లో ప‌వ‌న్ గురించి ప్ర‌స్తావించిన‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, జ‌ర జాగ్ర‌త్తగా ఉండాల‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు భ‌ద్ర‌తా సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగాల‌ని సూచించిన‌ట్టు టాక్.