NEWSTELANGANA

తెలంగాణ‌లో ఐఏఎస్ లు బ‌దిలీ

Share it with your family & friends

ఆరుగురికి స్థాన చ‌ల‌నం

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించాక గ‌త బీఆర్ఎస్ స‌ర్కార్ హ‌యాంలో చ‌క్రం తిప్పిన ఉన్న‌తాధికారుల‌పై వేటు వేసింది. మ‌రికొంద‌రికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న న‌వీన్ మిట్ట‌ల్, స్మితా స‌బ‌ర్వాల్ , జ‌యేష్ రంజ‌న్ ల‌ను అలాగే కొన‌సాగిస్తూ వ‌చ్చింది.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ప‌లువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ ల‌ను బ‌దిలీ చేస్తూ వ‌చ్చిన స‌ర్కార్ తాజాగా మ‌రో ఆరుగురికి స్థాన చ‌ల‌నం క‌ల్పించింది. రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారిగా ఉన్న వికాస్ రాజ్ కు షాక్ ఇచ్చింది.

ఆయ‌న‌ను స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీగా నియ‌మించింది. ఆయ‌న‌తో పాటు జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా మహేష్‌ దత్.. ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీగా శరత్.. స్పోర్ట్స్ డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మి.. రెవెన్యూ స్పెషల్ సెక్రటరీగా హరీష్.. మేడ్చల్ మల్కాజ్‌గిరి అదనపు కలెక్టర్‌గా రాధికా గుప్తాను నియ‌మించింది.

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి ఉత్త‌ర్వులు జారీ చేశారు.