నిరుద్యోగ అభ్యర్థులకు ఆర్ఎస్పీ టిప్స్
పరీక్షలపై ఈ నాలుగు రోజులు ఫోకస్ పెట్టండి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎట్టకేలకు విజయం సాధించారంటూ నిరుద్యోగులను అభినందించారు. న్యాయపరమైన డిమాండ్ల సాధణ కోసం ప్రయత్నం చేస్తూనే ప్రస్తుతం జరగబోయే ఉద్యోగ పరీక్షలలో ఉత్తీర్ణత పొందేలా కృషి చేయాలని కోరారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఉద్యోగార్థుల కోసం ప్రత్యేకంగా సూచనలు చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
- సిలబస్ ను గోడలకు అతికించుకోండి.
- కనీసం ఒక పది పాత ప్రశ్నాపత్రాలను సాల్వ్ చేయండి. ఏ విధంగా ప్రశ్నలడుగుతున్నారో తెలుస్తుంది. This is extremely important before you start prep as you know where you stand in terms of your preparedness.
- ప్రామాణిక పుస్తకాలను (తెలుగు అకాడమి) మళ్లీ మళ్లీ చదవండి. చదివేటప్పుడు ఒక రీసెర్చ్ స్కాలర్ లాగా కాకుండా ఒక స్టాక్ అనలిస్టులా చదవండి. అంటే ట్రెండ్ అర్థం చేసుకొని స్మార్ట్ గా ప్రిపేర్ అవడం అన్నమాట.
- గైడ్లు, కోచింగ్ మెటీరియల్ మీద ‘పూర్తిగా’ ఆధార పడకండి. టెస్టు సీరిస్ లు చాలు.
- పుస్తకాలను చదివేటప్పుడు మీరు స్వంతగా నోటు బుక్కులో ముఖ్యమైన పాయింట్లను రాసుకోండి. సెల్ ఫోన్లో టైపు చేసుకోవడం కాదు. వేరే వాళ్ల నోట్సు మీద మీరు ఆధారపడితే ఖచ్చితంగా ఫెయిల్ కాక తప్పదని హెచ్చరించారు.
- రోజుకు ఒక గంట కన్నా ఎక్కువగా యూట్యూబ్, వాట్సాప్, టెలిగ్రాం కోచింగులు లేదా ఆన్లైన్ టిప్స్ ను చూడకండి. ఎక్కువగా చూస్తే మీ అటెన్షన్ డైవర్ట్ అవుతుందని సూచించారు. Basically all apps are designed to grab your precious attention. Beware.
- Your company decides your destiny. దయచేసి సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో మాత్రమే తిరగండి. నిర్ధిష్టమైన సమయాల్లో (preferably between 5-7 PM or After Dinner- Group Discussion sessions ప్లాన్ చేసుకోండి)
- మద్యపానానికి, దావత్ లకు, సిగరెట్లకు, యూట్యూబ్ ఫన్ వీడియోలకు కొంతకాలం దూరంగా ఉండండి. All are poisons which will kill you over a period of time.
- మీకు తెలిసిన సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులను వారి పర్మిషన్ తో కలవండి. కొంత స్పూర్తి వస్తుంది. రిపీటెడ్ గా ఫెయిలయిన వాళ్ల గురించి ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి.
- కోచింగ్ కు డబ్బులు లేకపోయినా నలుగురు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్
కర్రీ పాయింట్ దగ్గర (to avoid cooking ))ఒక రూమ్ తీసుకొని, పాత ప్రశ్నా పత్రాలు , టెస్టు సీరిస్ పేపర్లు, డైలీ ఒక న్యూస్ పేపర్, గత రెండు సంవత్సరాల తెలంగాణ (I and PR) అధికార పత్రికలు, తెలుగు అకాడమి పుస్తకాలు, (4th class-12th class) స్టేట్ సిలబస్ పుస్తకాలు పెట్టుకొని చదివితే చాలు. మీరు విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.