NEWSNATIONAL

కోట్లాది మందికి కామ‌రాజ్ స్పూర్తి

Share it with your family & friends

బీజేపీ చీఫ్ అన్నామ‌లై కుప్పుస్వామి

త‌మిళ‌నాడు – కోట్తాది మందికి కామ‌రాజ్ స్పూర్తిగా నిలిచార‌ని అన్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ కుప్పుస్వామి అన్నామ‌లై. చెన్నైలో పెరుంతలైవర్ కామరాజ్ నాడ‌ర్ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని త‌మిళ‌నాడు నాడ‌ర్ సంఘం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ ఫంక్ష‌న్ లో పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

తమిళనాడులో విద్య, పరిశ్రమలు, వ్యవసాయం వంటి అన్ని రంగాలు కామరాజ్ పాలనపై ఆధారపడి ఉన్నాయ‌ని చెప్పారు అన్నామ‌లై. ఐఐటీ, బెల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవసాయానికి పెద్దపీట వేసిన కర్మవీరుల పాలన తమిళనాడుకు స్వర్ణ యుగంగా నిలిచి పోయింద‌న్నారు.

తాము తీసుకొచ్చిన జలజీవన్ పథకం కామ‌రాజ్ నుండి స్వీక‌రించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు అన్నామ‌లై.
అంతే కాకుండా ప్రతి జిల్లాలో విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించే కేంద్ర ప్రభుత్వ నవోదయ పాఠశాలలను పెరుంతలైవర్ కామరాజ్ పేరిట అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. కానీ డీఎంకే ప్రభుత్వం ఈ పాఠశాలలకు అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తోందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.