ఏపీలో వర్షాలపై అనిత ఆరా
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
అమరావతి – బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనంగా మారింది. భారీ ఎత్తున వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జల్లులతో నిండిపోయాయి. పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీడియా కాన్ఫరెన్స్ చేపట్టారు. ఈ సందర్బంగా కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.
రైతులకు, మత్స్య కారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు నష్ట పోయిన వారిని ఆదుకోవాలని, బాధితులకు అండగా నిలవాలని సూచించారు. ప్రభుత్వ పరంగా సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు ఏపీ హోం శాఖ మంత్రి.