కాళేశ్వరం పాపం కేసీఆర్ దే – ఉత్తమ్
మేడిగడ్డ కుంగుబాటుకు ఆయనే కారణం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను ఏకి పారేశారు. ఆయన నిర్వాకం కారణంగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పోయిందని సంచలన ఆరోపణలు చేశారు. తాము పదే పదే ఈ ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకుందని చెబుతూ వచ్చామని అన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం తనంతకు తానే గొప్ప ఇంజనీర్ ను అనుకుంటున్నారని, అలా అనుకునే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ప్రజలు పక్కన పెట్టినా బుద్ది రాలేదన్నారు.
గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఆర్భాటంగా నిర్మించిందని ధ్వజమెత్తారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేవలం కమీషన్ల కోసం ప్రాజెక్టును రీ డిజైన్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఎన్డీఎస్‌ఏ అధికారులతో కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష చేయడం జరిగిందని చెప్పారు.
.కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగి పోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం హైకాస్ట్ లోన్స్ తీసుకొచ్చారని ఆరోపించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. . సోమవారం ఇంజనీర్ల స్థాయిలో చర్చలు కొనసాగుతాయని తెలిపరు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగి పోవడంపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడ లేదంటూ మండిపడ్డారు.