తుపాను ఎఫెక్ట్ స‌ర్కార్ అల‌ర్ట్ : డిప్యూటీ సీఎం

మొంథా తుపానుతో అప్ర‌మ‌త్తంగా ఉండాలి

అమ‌రావ‌తి : ఏపీకి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ. తుపాను ఎఫెక్ట్ కార‌ణంగా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. సోమ‌వారం ఆయ‌న స‌చివాల‌యంలో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు డిప్యూటీ సీఎం. జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి. నారాయణ, స్పెషల్ ఆఫీసర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ , ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో 12 మండలాలపై ప్రభావం ఉంటుందనీ తెలిసిన క్రమంలో ముందస్తు చర్యలు పకడ్బందీగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.

ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు వారికి అవసరమైన ఆహారం, రక్షిత తాగు నీరు, పాలు, ఔషధాలు సమకూర్చుకోవాలి స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నందున ఎలాంటి ఆందోళన అవసరం లేదని ప్రజలకు తెలియ చేయాలని సూచించారు. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, కాబట్టి విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉంద‌ని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. కాబట్టి వాటి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, రోగుల వివరాలు తెలుసుకొని.. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని దిశానిర్దేశం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *