NEWSANDHRA PRADESH

పేద ప్ర‌జ‌ల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

Share it with your family & friends

మంత్రి డోలా బాల వీరాంజ‌నేయ స్వామి

అమ‌రావ‌తి – పేద ప్ర‌జ‌ల అభ్యున్న‌తి, వారి సంక్షేమ‌మే తమ కూట‌మి ప్ర‌భుత్వ ధ్యేయమ‌ని అన్నారు ఏపీ రాష్ట్ర సాంక్షిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజ‌నేయ స్వామి. రైతు బజార్ల‌లో రాయితీపై పేద‌ల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేస్తున్నామ‌ని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న‌ప్ప‌టికీ పేద‌లు ఆక‌లితో ఉండ కూడ‌ద‌ని స‌రుకులు పంపిణీ చేస్తున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తున్నామని మంత్రి స్ప‌ష్టం చేశారు.

ఏ-గ్రేడ్ కందిపప్పు కిలో రూ.160, రెండు రకాల నాణ్యమైన సోనా మసూరి బియ్యాన్ని కిలో రూ. 48 , రూ.49 కే ప్రజలకు అందిస్తున్నారు. ఒంగోలు లోని 3 రైతు బజార్లతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లోని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు.

ఈ కౌంటర్లు ఉదయం 8 నుంచి సాయంత్రం 8 వరకు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలని బాల శ్రీ వీరాంజ‌నేయ స్వామి కోరారు. వైసిపి హాయంలో పెరిగిన నిత్యవసరధరలతో పేదలు అర్ధాకలితో అలమటించారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ పాలనలో అడ్డూ అదుపు లేకుండా పెరిగిన ధరలు తగ్గించి పేదలకు ఊరట కలిగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసి రూ.5 లకే పేదల ఆకలి తీరుస్తామని మంత్రి అన్నారు.