ఎన్డీఎస్ఏ సమావేశంపై సీఎం సమీక్ష
న్యూఢిల్లీలో రేవంత్ రెడ్డి బిజీ బిజీ
న్యూఢిల్లీ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఆయనతో పాటు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ప్రధాన అంశంగా మారింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతుల వ్యవహారం తలనొప్పిగా తయారైంది.
కాళేశ్వరం కాదది రాష్ట్రానికి శనేశ్వరంగా మారిందని ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు సీఎం. తాజాగా సోమవారం కీలకమైన ఎన్డీఎస్ఏ సమావేశం జరగనుంది. ఈ సందర్బంగా ఎలా వాదించాలో, కేంద్రాన్ని ఎలా ఒప్పించాలనే దానిపై పూర్తి వివరాలతో ఉన్నతాధికారులకు సూచించారు.
ఇందులో ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ తదితర అంశాలపై చర్చించారు ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాక మంత్రి రాహుల్ బొజ్జ, నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యా నాథ్ దాస్ లు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం కమీషన్ల కోసమే ఆ ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ కట్టారంటూ ఆరోపించారు. డబ్బుల కోసం రీ డిజైన్ చేశారని ధ్వజమెత్తారు.