ఏపీలో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్
నిప్పులు చెరిగిన విజయ సాయి రెడ్డి
అమరావతి – ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు శాంతి లేకుండా పోయిందన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కార్ కొలువు తీరాక ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
హత్యలు పెరిగి పోయాయని, సామాన్యులకు , ప్రధానంగా తమ వైసీపీ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని వాపోయారు విజయ సాయి రెడ్డి. ఒక రకంగా లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు నిద్ర పోతున్నారా అంటూ ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు 30 హత్యలు, 300కి పైగా హత్యా యత్నాలు, 490 ప్రభుత్వ ఆస్తులు, 500 ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పారు విజయ సాయిరెడ్డి. శాంతి భద్రతలు క్షీణించిన ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.
ఇదిలా ఉండగా ఇవాళ జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని తమ పార్టీ డిమాండ్ చేసిందన్నారు. కానీ టీడీపీ బీజేపీతో రాజీ పడటం వల్ల స్పెషల్ స్టేటస్ గురించి ఊసే ఎత్తలేదన్నారు.