జో బైడెన్ నిజమైన దేశ భక్తుడు
ప్రశంసించిన మాజీ చీఫ్ ఒబామా
అమెరికా – అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన దేశాధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదే సమయంలో ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు ఒబామా.
జో బైడెన్ అత్యున్నతమైన విలువలు కలిగిన నాయకుడని, నిజమైన దేశ భక్తుడంటూ కితాబు ఇచ్చారు. బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్బంగా సుదీర్ఘ ప్రకటన చేశారు .
జో బైడెన్ అమెరికా అత్యంత పర్యవసానమైన అధ్యక్షులు ఒకరు. ఆయన నాకు ప్రియమైన స్నేహితుడు అని పేర్కొన్నారు. తన పదవీ కాలంలో కరోనా మహమ్మారిని అంతం చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాడు. మందుల ధరలను తగ్గించాడు. 30 ఏళ్లలో ఆయుధ భద్రత చట్టాన్ని ఆమోదించేలా చేశాడు. చరిత్రలో వాతావరణ మార్పులను పరిష్కరించేందుకు ప్రయత్నం చేశాడని ప్రశంసించారు.
శ్రామిక ప్రజలు నాణ్యమైన వేతనాలు పొందేలా చేశాడు. అంతర్జాతీయంగా అమెరికాను ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశారు. నాటోను పునరుద్దరించాడు. ఉక్రెయిన్ లో రష్యా దురాక్రమణను నిరసించాడు. ప్రపంచాన్ని సమీకరించాడంటూ బైడెన్ ను ఆకాశానికి ఎత్తేశాడు ఒబామా.