బైడెన్ అత్యంత చెత్త ప్రెసిడెంట్
షాకింగ్ కామెంట్స్ చేసిన ట్రంప్
అమెరికా – అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుత దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్ ను ఏకి పారేశారు. దేశ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు. ఈ సందర్బంగా తీవ్రంగా స్పందించారు ట్రంప్.
దేశంలో అత్యంత చెత్త అధ్యక్షుడిగా పేర్కొంటూ కీలక వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. అమెరికా దేశ చరిత్రలో ఇలాంటి ఫెయిల్యూర్ వ్యక్తిని తాను చూడలేదంటూ ఎద్దేవా చేశారు. దేశంలో అక్రమంగా వలసదారులను అనుమతించి సర్వ నాశనం చేశాడంటూ ఆరోపించారు డొనాల్డ్ ట్రంప్.
తన అనారోగ్యం కారణంగా తాజాగా దేశంలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు జోసెఫ్ బైడెన్. తాను ప్రస్తుత ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారీస్ ను ప్రెసిడెంట్ రేసులా ఉంటారని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా జోసెఫ్ బైడెన్ చేసిన ప్రకటనపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఇప్పటి వరకు ఉన్న అధ్యక్షులలో బైడెన్ అత్యున్నతమైన దేశ భక్తుడంటూ ప్రశంసలు కురిపించారు.