వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
కుప్పం వద్ద అదుపులోకి తీసుకున్న ఖాకీలు
అమరావతి – వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు నుండి వస్తుండగా కుప్పం వద్ద ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది కాలంగా వివాదాలకు కేరాఫ్ గా మారారు నాగార్జున యాదవ్.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెలతో పాటు తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ తో జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం రేవంత్ ను డెలివరీ బాయ్ తో పోల్చాడు నాగార్జున యాదవ్. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ఇదిలా ఉండగా కుప్పంకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. బెంగళూరు నుంచి వస్తుండగా నాగార్జున యాదవ్ ను కాపు కాసి అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్ పై 196(1) , 351(2) బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.