NEWSANDHRA PRADESH

ఖాకీల జులుం జ‌గ‌న్ రెడ్డి ఆగ్ర‌హం

Share it with your family & friends

అసెంబ్లీకి చేరుకున్న మాజీ సీఎం

అమ‌రావ‌తి – ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి ర్యాలీగా బ‌య‌లు దేరి అసెంబ్లీకి వెళ్లారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో పాటు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి వ‌చ్చారు.

సేవ్ డెమోక్ర‌సీ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీకి వెళుతున్న త‌మ‌ను పోలీసులు అడ్డు కోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. వెల‌గ‌పూడిలోని శాస‌న స‌భ ప్రాంగణానికి చేరుకున్నారు. వారి చేతుల్లో ప్ల కార్డులు, పేప‌ర్లు లాక్కుని పోలీసులు చింపేశారు.

ఖాకీలు ప్ర‌వ‌ర్తించిన తీరు ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. చింపేసే అధికారం మీకు ఎవ‌రు ఇచ్చారంటూ నిల‌దీశారు. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

పోలీసుల జులుం ఎక్కువ కాలం సాగ బోదంటూ హెచ్చ‌రించారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కానీ, యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కోసం కాదని ఫైర్ అయ్యారు .