NEWSANDHRA PRADESH

వైసీపీ ఎమ్మెల్యేల నిర‌స‌న‌..ఆందోళ‌న‌

Share it with your family & friends

న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి ప్ర‌సంగం అడ్డ‌గింపు

అమ‌రావ‌తి – సీన్ మారింది..ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు సోమ‌వారం తీవ్ర ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌తలు క్షీణించాయ‌ని, ఇప్ప‌టికే హ‌త్య‌లు, అత్యాచారాలు, హ‌త్యా య‌త్నాల‌కు కొద‌వ లేకుండా పోయింద‌ని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యేలు.

పార్టీ చీఫ్ , మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా బ‌య‌లు దేరి అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా పెద్ద ఎత్తున తోపులాట చోటు చేసుకుంది. న‌ల్ల బ్యాడ్జీలు ధ‌రించి, ప్ల కార్డులు ప‌ట్టుకుని వ‌చ్చారు. సేవ్ డెమోక్ర‌సీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేయ‌డంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్ల కార్డులు, కాగితాల‌ను చింపి పారేశారు. దీనిని తీవ్రంగా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా సీరియ‌స్ అయ్యారు ఖాకీల‌పై.

మీ త‌ల‌ల‌పై ఉన్న గుర్తు ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడేందుక‌ని, త‌మ‌పై దౌర్జ‌న్యం చేయ‌డానికి కాద‌ని హెచ్చ‌రించారు. అధికారం ఎక్కువ కాలం ఉండ‌ద‌ని, ఇది గుర్తు పెట్టుకుంటే మంచిద‌ని స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.