ఆర్ఆర్ఆర్ షేక్ హ్యాండ్ జగన్ కంగ్రాట్స్
అసెంబ్లీలో అరుదైన సన్నివేశం
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. నిన్నటి దాకా ఉప్పు నిప్పు లాగా ఉన్నారు రఘు రామ కృష్ణం రాజు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆర్ఆర్ఆర్. ఆయన ఎంపీగా ఉన్నారు. చివరకు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో గత్యంతరం లేక రఘురామ కృష్ణం రాజు బయట పడ్డాడు. తాజాగా ఎన్నికలు అయ్యేంత వరకు ఆర్ఆర్ఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, ఆయన పరివారంపై.
రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో రఘురామ తెలుగుదేశం పార్టీలో చేరారు. మండి శాసన సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తీరా ఎన్నికల ఫలితాలు ఊహించని షాక్ ఇచ్చాయి జగన్ రెడ్డికి. కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు.
ప్రస్తుతం కేసు కూడా నడుస్తోంది. ఇవాళ శాసన సభకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వెళ్లి రఘు రామ కృష్ణం రాజు పలకరించడం అందరినీ విస్తు పోయేలా చేసింది. ప్రతిపక్షం అన్నది బలంగా లేక పోతే అధికార పక్షం ఉన్నా లేనట్టేనని పేర్కొనడం గమనార్హం.