SPORTS

ఫిట్ నెస్ పైనే రోహిత్..కోహ్లీ ఫ్యూచ‌ర్

Share it with your family & friends

షాకింగ్ కామెంట్స్ చేసిన గౌతమ్ గంభీర్

ముంబై – భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ భ‌విష్య‌త్తులో ఆడ‌తారా లేదా అన్న దానిపై న‌ర్మ గ‌ర్భంగా కామెంట్స్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌స్తుతం రోహిత్, కోహ్లీ ఫ్యూచ‌ర్ పై చ‌ర్చ జ‌రుగుతోంద‌ని, దీనిపై తాము ఆలోచిస్తున్నామ‌ని చెప్పాడు. అయితే వారిద్ద‌రి ఫిట్ నెస్ పై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు గంభీర్.

ఫిట్ నెస్ లేక పోవ‌డం వ‌ల్ల‌నే టి20 జ‌ట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేక పోయామ‌ని చెప్పాడు. సూర్య కుమార్ యాద‌వ్ ప‌ర్ ఫార్మెన్స్ బాగుండ‌డంతో అత‌డికి నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించాల్సి వ‌చ్చింద‌న్నాడు. దీనిని స‌మ‌ర్థించాడు సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అగార్క‌ర్.

ఇక రోహిత్, కోహ్లీలు టి20 ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యార‌ని, మిగ‌తా వాటిలో ఉంచాలా లేదా అన్న‌ది ఆలోచిస్తాన‌ని అన్నాడు గంభీర్. ఇక ర‌వీంద్ర జ‌డేజా వ‌న్డేల నుంచి దూరం పెట్టారా అన్న ప్ర‌శ్న‌కు అలాంటిది ఏమీ లేద‌న్నాడు. అత‌డికంటే అక్ష‌ర్ ప‌టేల్ బెట‌ర్ అని భావించామ‌న్నాడు. అయితే టెస్టు జ‌ట్టులో జిడ్డూ ఉండేందుకు ఎక్కువ‌గా ఆస్కారం ఉంద‌న్నాడు.

శుభ్ మ‌న్ గిల్ మూడు ఫార్మాట్ ల‌కు స‌రైన ఆట‌గాడు అంటూ కితాబు ఇచ్చాడు అగార్క‌ర్.