కోహ్లీ ప్రపంచ స్థాయి క్రికెటర్
ఇద్దరి మధ్య దగ్గరి బంధం ఉంది
ముంబై – భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు . స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి , ఆయన భవిష్యత్తు గురించి నర్మ గర్భమైన కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబైలో సోమవారం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అగార్కర్ తో కలిసి మాట్లాడారు.
మీకు కోహ్లీకి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని, ఆ ప్రభావం ఎంపికపై పడుతుందా అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు గంభీర్. కోహ్లీతో నాకున్న సంబంధం ప్రజల కోసం కాదన్నాడు. మైదానంలో తన జట్టు కోసం పోరాడే హక్కు ప్రతి ఒక్క క్రీడాకారుడికీ ఉంటుందన్నాడు హెడ్ కోచ్.
విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంటుందని ప్రశ్నించాడు. తను గొప్ప క్రికెటర్ . కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ప్లేయర్. అతడి ఆట తీరు ఎప్పుడూ అటాకింగ్ మీదే ఉంటుందన్నాడు. అతను ప్రపంచ స్థాయి ఆటగాడని కితాబు ఇచ్చాడు. విరాట్ కోహ్లీ పట్ల తనకు గౌరవమే కాదు అభిమానం కూడా ఉంటుందన్నాడు గౌతమ్ గంభీర్.
క్రికెటర్లు కూడా మనుషులే. వారికి కుటుంబాలు ఉంటాయి. అంతకు మించి స్నేహాలు, అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయన్నాడు. అలాగని ఈర్ష్యా ద్వేషాలు అనేవి ఉండవని పేర్కొన్నాడు హెడ్ కోచ్.