నీట్ పై దద్దరిల్లిన పార్లమెంట్
ధనికులకే అందుతున్న సీట్లు
న్యూఢిల్లీ – నీట్ యుజి 2024 స్కామ్ వ్యవహారంపై సోమవారం జరిగిన పార్లమెంట్ సమావేశాలలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ సందర్బంగా ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం కావాలని తాత్సారం చేస్తోందని, ఎన్టీఏ నిర్వాకం కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.
మోడీ సర్కార్ హయాంలో విద్యా పరంగా పలు స్కామ్ లు చోటు చేసుకున్నాయని, అయినా పీఎం మోడీ కానీ విద్యా శాఖ మంత్రి కానీ స్పందించక పోవడం దారుణమన్నారు. గత 7 సంవత్సరాల కాలంలో పేపర్ లీకేజీలు కంటిన్యూగా కొనసాగుతూ వస్తున్నాయని ఆరోపించారు.
ప్రధానంగా భారతీయ పరీక్షా విధానం ధనికులకు అమ్ముడు అవుతోందని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. దీని వల్ల లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లి పోయిందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్.
కాగా విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సీరియస్ గా స్పందించారు. నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వం తీసుకు వచ్చిందని అన్నారు. పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య దానిని తప్పుదోవ పట్టిస్తే ఎలా అని నిలదీశారు.