కేంద్ర మంత్రి పూరీని కలిసిన సీఎం
మల్లు భట్టితో పాటు ఉత్తమ్ కూడా
న్యూఢిల్లీ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. అంతకు ముందు పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చాక ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల రుణాలను రైతులకు సంబంధించి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.
తొలి విడతగా ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. దీని కోసం భారీ ఎత్తున ఖర్చు చేసింది. ఖజానాలో డబ్బులు లేక పోయినా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఇదిలా ఉండగా సోమవారం ఢిల్లీ టూర్ లో భాగంగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయుల శాఖ మంత్రి
హర్ దీప్ సింగ్ పూరీని కలిశారు. ఈ సందర్బంగా తెలంగాణలో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి తెలిపారు సీఎం.
.
వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.