విజయం ఖాయం మాదే అధికారం
స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంతగా దౌర్జన్యానికి దిగినా జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు.
సంక్రాంతి పండుగ సందర్బంగా తాడేపల్లి గూడెంలో జరిగిన సంక్రాంతి సంబురాలలో పాలు పంచుకున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి పతంగులు ఎగుర వేశారు. అనంతరం తన స్వంత ఊరు నారా వారి పల్లెకు వెళ్లారు. అక్కడ చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి విజయం సాధించడం ఖాయమని, ఇక తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్ మోహన్ రెడ్డికి జనం తగిన రీతిలో గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు చంద్రబాబు నాయుడు.
సంక్షేమ పథకాలు, కార్యక్రమాల పేరుతో ప్రజల చెవుల్లో పూలు పెట్టాడంటూ మండిపడ్డారు. ఆరు నూరైనా సరే టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.