NEWSTELANGANA

స్మితా స‌బర్వాల్ కామెంట్స్ బాల‌ల‌త సీరియ‌స్

Share it with your family & friends

త‌క్ష‌ణ‌మే ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్

హైద‌రాబాద్ – విక‌లాంగుల (విభిన్న ప్ర‌తిభావంతులు) చుల‌క‌న భావంతో కామెంట్స్ చేసిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి, సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ స్మితా స‌బ‌ర్వాల్ పై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు విభిన్న ప్ర‌తిభావంతులు. ఇది ఒక స్థాయి క‌లిగిన అధికారి కామెంట్స్ చేయ‌డం త‌గ‌ద‌ని పేర్కొన్నారు.

సోమ‌వారం ప్ర‌ముఖ ఐఏఎస్ కోచింగ్ నిర్వాక‌రులు బాల ల‌త మ‌ల్ల‌వ‌రపు హైద‌రాబాద్ లోని ప్రెస్ క్ల‌బ్ లో మీడియాతో మాట్లాడారు. స్మితా స‌బ‌ర్వాల్ త‌మ ప‌ట్ల చుల‌క‌న చేసి మాట్లాడ‌టం త‌గ‌ద‌న్నారు. ఆమెపై శాఖా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె డిమాండ్ చేశారు. బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని కోరారు.

ద‌మ్ముంటే త‌న‌తో క‌లిసి ఇప్పుడు స్మితా స‌బ‌ర్వాల్ ప‌రీక్ష‌లు రాయాల‌ని స‌వాల్ విసిరారు బాల ల‌త ముల్ల‌వ‌ర‌పు. అస‌లు విభిన్న ప్ర‌తిభావంతుల ప‌ట్ల చుల‌క‌న‌గా మాట్లాడే హ‌క్కు ఎవ‌రు ఇచ్చారంటూ ప్ర‌శ్నించారు. ఒక బాధ్య‌త క‌లిగిన అధికారి ఇలాగేనా మాట్లాడేది అంటూ మండిప‌డ్డారు.

ఇటువంటి వ్యాఖ్యలు న్యాయ, పార్లమెంటరీ నిర్ణయాలను బలహీనప రుస్తాయని, వికలాంగుల సమాజాన్ని మరింత దూరం చేస్తాయని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సివిల్ సర్వీస్ క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాల ల‌త మల్లవరపు కోరారు.

ప‌దేళ్ల పాటు సీఎంఓలో ఆమె ఎలాంటి ప‌నులు చేశారో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. ఆమె వ్య‌క్తిగ‌త జీవితం గురించి మాట్లాడ‌టం లేద‌ని, కానీ వికలాంగుల ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేసే హ‌క్కు, అర్హ‌త ఆమెకు లేద‌న్నారు బాల ల‌త ముల్ల‌వ‌ర‌పు.