ప్రభుత్వ నిర్లక్ష్యం వృద్దులకు శాపం
మాజీ మంత్రి హరీశ్ రావు కామెంట్స్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని ఇప్పటి వరకు ఒక్కటి కూడా భర్తీ చేయలేక పోయారని ఆరోపించారు.
పెన్షన్లు రాక వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత మూడు నెలలుగా వారికి రాలేదన్నారు హరీశ్ రావు. ఇస్తామన్న రూ. 4 వేల పెన్షన్ ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. అత్యంత పేదలు ఎక్కువగా వృద్దులలో ఉన్నారని, వారి పట్ల దయతో ఆలోచించాలని కోరారు. ఇలాగైతే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు తన్నీరు హరీశ్ రావు.
వారి పట్ల ఎందుకు ఇంత నిర్దయగా ఉన్నారంటూ ప్రశ్నించారు. ఇక పోలీస్ శాఖలో డీజిల్ కు డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదని, వారు ఎలా విధులు నిర్వహిస్తారంటూ నిలదీశారు. గత 7 నెలలుగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటూ మండిపడ్డారు. ఇక హోమ్ గార్డులకు ఇప్పటి వరకు జీతాలు చెల్లించ లేదన్నారు. సాంస్కృతిక శాఖలో కళాకారులు లబో దిబో మంటూ వాపోతున్నారని తెలిపారు హరీశ్ రావు.
ఇక కళ్యాణ లక్ష్మి ఆగి పోయిందని, సీఎం , మంత్రులు ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్పా చేసింది ఏమీ లేదన్నారు.