NEWSNATIONAL

ఇరా సింఘాల్ నెట్టింట్లో వైర‌ల్

Share it with your family & friends

ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాలి

హైద‌రాబాద్ – దేశ వ్యాప్తంగా చ‌ర్చనీయాంశంగా మారారు తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ , రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌దర్శి స్మితా స‌బ‌ర్వాల్. విక‌లాంగుల‌కు ఎందుకు రిజ‌ర్వేష‌న్లు అంటూ ట్విట్ట‌ర్ ఎక్స్ వేదిక‌గా చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. దేశ‌మంత‌టా ఆమె కామెంట్స్ ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అంద‌రూ మ‌నుషులేన‌న్న ఆలోచ‌న లేక పోవ‌డం ప‌ట్ల కూడా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. దివ్యాంగులు కూడా ఇవాళ అన్ని రంగాల‌లో పాలు పంచుకుంటున్నారు. ఒక‌నాడు దేశంలోనే అత్యుత్త‌మ‌మైన పార్ల‌మెంటేరియ‌న్ గా గుర్తింపు పొందిన సూదిని జైపాల్ రెడ్డి కూడా దివ్యాంగుడేన‌న్న విష‌యం మ‌రిచి పోకూడ‌దు.

ఇదిలా ఉండ‌గా విభిన్న ప్ర‌తిభావంతురాలైన ఇరా సింఘాల్ గురించి అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఆమె 2014లో ఆల్ ఇండియా సివిల్స్ లో నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్ సాధించారు. మార్కుల్లో ఆమెను ఇంత వ‌ర‌కు ఎవ‌రూ బీట్ చేయ‌లేక పోయారు.

గ‌త 10 సంవ‌త్స‌రాలుగా ఆమె అనేక ర‌కాలైన అత్యున్న‌త‌మైన ప‌ద‌వుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించారు. ల‌క్ష‌లాది మందికి స్పూర్తి దాయ‌కంగా నిలుస్తూ వ‌స్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి రోల్ మోడ‌ల్ గా నిలిచారు బాల ల‌త. ఆమె 12 ఏళ్ల పాటు సివిల్ స‌ర్వెంట్ గా ప‌ని చేశారు.

స్వ‌చ్చంధంగా బ‌య‌ట‌కు వ‌చ్చి వంద‌లాది మందిని ఐఏఎస్ లుగా తీర్చి దిద్దే ప‌నిలో ఉన్నారు. ఇక‌నైనా ఇలాంటి కామెంట్స్ చేయ‌డాన్ని నిలిపి వేస్తే మంచిద‌ని సూచిస్తున్నారు.