స్మిత అహంకారం ఆకునూరి ఆగ్రహం
రాజ్యాంగాన్ని గౌరవించక పోతే ఎలా..?
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ దివ్యాంగుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. అయినా ఎక్కడా తగ్గడం లేదు స్మితా సబర్వాల్. శారీరకంగా బలహీనులైన విభిన్న ప్రతిభావంతులకు సివిల్స్ ఎందుకు అంటూ ప్రశ్నించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి.
మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు . ఇలాంటి అహంకార పూరిత ధోరణి మంచిది కాదని అన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించని వాళ్లు పాలసీ మేకర్స్ ఎలా అవుతారంటూ ప్రశ్నించారు ఆకునూరి మురళి.
పార్లమెంట్ చేసిన వికలాంగుల 1995లో వచ్చిన చట్టం గురించి స్మితా సబర్వాల్ కు తెలియక పోవడం దారుణమన్నారు. దాని ప్రకారమే జాబ్స్ లలో రిజర్వేషన్స్ వర్తింప చేస్తున్నారన్న విషయం గుర్తించక పోవడం, స్థాయికి దిగజారి కామెంట్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కేసీఆర్ సపోర్ట్ తో దేశంలోనే హెలికాప్టర్ లలో తిరిగే ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కదా అందుకే తల బిరుసుతనం ఉంటుందేమో అంటూ మండిపడ్డారు ఆకునూరి మురళి.